యాపిల్ ఐఫోన్ 17 సిరీస్ విక్రయాలు ఈ రోజు ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ యాపిల్ స్టోర్ బయట కొనుగోలుదారులు అర్ధరాత్రి నుంచే బారులు తీరారు. ఢిల్లీ లోని యాపిల్ స్టోర్ ముందుకు కూడా పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌ను కొనుగోలు చేసిన అమాన్ మెమన్ అనే వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ హర్షం వ్యక్తంచేశాడు. గత ఆరు నెలలుగా దీన్ని కొనుగోలు చేసేందుకు ఎదురుచూశానని పేర్కొన్నాడు. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, 17 ప్రోమ్యాక్స్ మోడళ్లను ఇటీవల యాపిల్ తీసుకొచ్చింది. యాపిల్ ఈసారి బేస్ మోడళ్లను 256జీబీ వేరియంట్‌లో తీసుకొచ్చింది. ఐఫోన్ 17 ధర రూ.82,900 కాగా ఎయిర్‌మోడల్ ధర రూ.1,19,900గా కంపెనీ నిర్ణయించింది. ఐఫోన్ 17 ప్రో ధర రూ.1,34,900గా పేర్కొంది. అలాగే ప్రో మ్యాక్స్ ధర రూ.1,49,900గా ఉంది.
'ఐఫోన్ 17' కోసం అర్ధరాత్రి నుంచే బారులు తీరిన కొనుగోలుదారులు
September 19, 2025
0
Tags