రష్యాలో భారీ భూకంపం : రిక్టర్ స్కేల్‌పై 7.8గా నమోదు

Telugu Lo Computer
0


రష్యా తూర్పు ప్రాంతంలోని కమ్చట్కా ద్వీపకల్ప తీరాన్ని శుక్రవారం తెల్లవారుజామున శక్తివంతమైన భూకంపం తీవ్రంగా కుదిపేసింది. రిక్టర్ స్కేల్‌పై 7.8 తీవ్రత నమోదైన ఈ భూకంపం కారణంగా ఆ ప్రాంతం ఒక్కసారిగా భయానక దృశ్యంగా మారింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. శక్తివంతమైన కంపనాల వల్ల ఇళ్లలోని వస్తువులు పడిపోయాయి. కిటికీలు, తలుపులు బిగ్గరగా మూసుకుపోవడంతో మరింత భయం పుట్టింది. కొద్ది సెకన్లపాటు కొనసాగిన కంపనాలు ఆ తర్వాత కూడా తక్కువ తీవ్రతతో పలుమార్లు అనుభవించబడ్డాయి.అప్రమత్తమైన అధికారులు తక్షణమే సునామీ హెచ్చరికను జారీ చేశారు. అమెరికా జియోలాజికల్ సర్వే నివేదిక ప్రకారం ఈ భూకంపం ప్రాంతీయ రాజధాని పెట్రోపావ్లోవ్స్క్-కమ్చట్కాస్కీకి తూర్పున 128 కిలోమీటర్ల దూరంలో.. కేవలం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. ఇది భూ ఉపరితలానికి దగ్గరగా ఉన్నందున ప్రకంపనలు తీవ్రంగా ఉన్నాయని నిపుణులు తెలిపారు. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టమూ సంభవించలేదు. రష్యా రాష్ట్ర జియోఫిజికల్ సర్వీస్ స్థానిక శాఖ ఈ భూకంపం తీవ్రతను 7.4గా అంచనా వేసింది. ప్రధాన భూకంపం తర్వాత కనీసం ఐదు సార్లు ప్రకంపనలు నమోదయ్యాయని వెల్లడించింది.ఈ భూకంపంపై స్పందించిన కమ్చట్కా ప్రాంత గవర్నర్ వ్లాదిమిర్ సోలోడోవ్ టెలిగ్రామ్ లో ఒక పోస్ట్ చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)