తమిళ హాస్య నటుడు రోబో శంకర్ మృతి

Telugu Lo Computer
0


మిళ హాస్యనటుడు రోబో శంకర్ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఇటీవల ఆరోగ్యం మరింత దిగజారడంతో పిన్న వయసులోని కన్నుమూశారు. కిడ్నీల సమస్యతో బాధపడుతున్న రోబో శంకర్, ఇటీవల ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న సమయంలో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి పడిపోయారు. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స అందించారు. అయినప్పటికీ ఆరోగ్యం మెరుగు పడక మృతి చెందారు. రోబో శంకర్ తన కెరీర్‌ను "హే", "దీపావళి" సినిమాలతో ప్రారంభించారు. అయితే, ఆయనకు అసలైన గుర్తింపు ధనుష్ హీరోగా నటించిన "మారి" సినిమాతో వచ్చింది. ఈ చిత్రంలో ఆయన చేసిన పాత్రకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఆయన కామెడీ టైమింగ్‌, బాడీ లాంగ్వేజ్ తో ఆయన చేసే నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రోబో శంకర్ భార్య పేరు ప్రియాంక శంకర్, కూతురు ఇంద్రజ. ఆమె కూడా నటిగా కొనసాగుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)