తమిళనాడులోని ధర్మపురి జిల్లా పెన్నాగరం తాలూకా ఏరియూర్ కు సమీపంలోని అత్తిమరత్తూర్ గ్రామానికి చెందిన తంగరాజ్ వృత్తి రీత్యా లారీ డ్రైవర్. ఇతడి భార్య హంస. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. సరిగా ఆరు సంవత్సరాల క్రితం తంగరాజ్ తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. ఎన్ని ఆసుపత్రులలో చూపించినప్పటికీ అతని వ్యాధి నయం కాలేదు. దీంతో బంధువులు చెప్పగా పెన్నాగరం వెళ్ళాడు. అక్కడికి సమీపంలోని బి అగ్రహారం గ్రామంలో ముత్తు మారియమ్మన్ ఆలయానికి వెళ్ళాడు. అక్కడ పూజలు చేసుకున్నాడు. తనకు ఆరోగ్యం మెరుగైతే మేకలను బలి ఇస్తానని మొక్కుకున్నాడు. అతడు కోరుకున్నట్టుగానే ఆరోగ్యం మెరుగయింది. దీంతో తంగరాజ్ ఆలయానికి వచ్చి 151 మేకలను అమ్మవారికి బలి ఇచ్చాడు. ఆ తర్వాత వాటి ద్వారా మటన్ బిర్యానీ వండి భక్తులకు విందు ఇచ్చాడు. 151 మేకల కోసం తంగరాజ్ ఏకంగా 10 లక్షల వరకు ఖర్చు చేశాడు. వాస్తవానికి ఈ ఆలయ చరిత్రలో ఈ స్థాయిలో ఎన్నడూ మేకలను బలి ఇవ్వలేదు. తంగరాజ్ దాదాపు 2000 మందికి మాంసంతో విందు ఇవ్వడం విశేషం.
అమ్మవారికి 151 మేకలను బలి ఇచ్చిన లారీ డ్రైవర్ తంగరాజ్ !
September 17, 2025
0
Tags