చైనాలో రెడ్‌మీ 15ఆర్ 5G విడుదల

Telugu Lo Computer
0


చైనాలో రెడ్‌మీ 15ఆర్ 5G హ్యాండ్‌సెట్‌ విడుదల అయింది. ఈ కొత్త ఫోన్ మొత్తంగా నాలుగు రంగులలో, 5 వేర్వేరు ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో ఉంది. దీనిలో 6,000mAh బ్యాటరీతో పాటు 33W ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇది ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో గరిష్టంగా 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ ఉన్నాయి. రెడ్‌మీ 15R 5G 6.9 అంగుళాల డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా ఇది దుమ్ము, నీటి నిరోధకత కోసం IP64 రేటింగ్‌ను కలిగి ఉంది.ఈ  మొబైల్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2 ఇంటర్‌ఫేస్‌పై పనిచేస్తుంది. ఇందులో 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లే, 720×1,600 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, ఇంకా 810 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉన్నాయి. ఈ డిస్‌ప్లే బ్లూ లైట్ ఎమిషన్స్ కోసం TUV రైన్‌ల్యాండ్ ధృవీకరణ పొందింది. రెడ్‌మీ 15R 5G ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పాటు, 12GB LPDDR4X ర్యామ్, గరిష్టంగా 256GB UFS 2.2 స్టోరేజ్‌తో లభించనుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 13MP వెనుక కెమెరా, సెల్ఫీలు, వీడియో కాలింగ్ ల కోసం 5MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. రెడ్‌మీ 15R 5G 6,000mAh బ్యాటరీతో పాటు 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 171.56×79.47×7.99mm కొలతలు ఉండగా.. 205గ్రాముల బరువు కలిగి ఉంది. రెడ్‌మీ 15R 5Gలో కనెక్టివిటీ ఎంపికలలో 5G, Wi-Fi 802.11 a/b/g/n/a, బ్లూటూత్ 5.4, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)