శుభాంశు శుక్లాతో సంభాషణ గొప్పగా సాగింది : ప్రధాని మోడీ ట్వీట్‌

Telugu Lo Computer
0


భారత వ్యోమగామి శుభాంశు శుక్లా నేడు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శుభాంశు తన రోదసి ప్రయాణ విశేషాలను ప్రధానితో పంచుకున్నారు. యాత్ర విజయవంతంపై మోడీ ఆయన్ను అభినందించారు. ''శుభాంశు శుక్లాతో సంభాషణ గొప్పగా సాగింది. అంతరిక్షంలో ఆయన అనుభవాలు, శాస్త్రసాంకేతిక రంగాల్లో పురోగతి, భారత్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక 'గగన్‌యాన్' మిషన్‌ సహా అనేక అంశాలపై చర్చించాం. రోదసిలో శుభాంశు సాధించిన ఘనత పట్ల యావత్‌ దేశం గర్విస్తోంది'' అని ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా జూన్‌ 25 నుంచి జులై 15 వరకు శుభాంశు శుక్లా తన బృందంతో కలిసి 'ఐఎస్‌ఎస్‌' యాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. దీని కోసం శిక్షణ పొందుతూ ఏడాదిగా ఆయన అమెరికాలో ఉన్నారు. ఆదివారం తెల్లవారుజామున భారత్‌కు తిరిగొచ్చారు. శుభాంశు అంతరిక్ష యాత్ర విజయవంతంపై లోక్‌సభలో ప్రత్యేకంగా చర్చించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)