స్పష్టమైన విజన్‌ ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమే : మంత్రి నారా లోకేశ్‌

Telugu Lo Computer
0


విశాఖ నోవాటెల్‌లో ఏర్పాటు చేసిన ఏరోస్పేస్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ సీఐఐ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి నారా లోకేశ్‌ స్పష్టమైన విజన్‌ ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని అన్నారు. ''శంషాబాద్‌ విమానాశ్రయానికి అన్ని వేల ఎకరాలు ఎందుకని ఆనాడు చంద్రబాబును అందరూ అడిగారు. ఇప్పుడు తెలంగాణ జీడీపీలో 11 శాతం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచే వస్తోంది. విశాఖకు గూగుల్‌ డేటా సెంటర్‌ వస్తోంది. పునరుత్పాదక ఇంధన వనరుల ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో పరిపాలన చూసే కేంద్రం అండగా ఉంటోంది. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నాం. 15 శాతం వృద్ధిరేటు దిశగా వెళ్తున్నాం. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు వల్లే రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టగలిగాం'' అని వివరించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)