వ్యవసాయ పరికరాల కొనుగోలుకు సబ్సిడీపై రుణాలు

Telugu Lo Computer
0


తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ పరికరాల కొనుగోలుకు సబ్సిడీపై రుణాలు అందిస్తుంది. ప్రభుత్వం అందించే ఈ సబ్సిడీ విధానం వల్ల రైతులు సగం ఖర్చుతోనే ఆధునిక వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. వ్యవసాయ పరికరాల కొనుగోలు రైతులకు భారం కాకుండా ప్రభుత్వం వారికి 50 శాతం సబ్సిడీతో అందిస్తోంది. స్థానిక ఏఈఓ ల వద్ద రైతులు అవసరమైన పత్రాలు జిరాక్స్ కాపీలను జత చేసి దరఖాస్తు చేసుకుంటే వారికి కావలసిన ఆధునిక యంత్ర పరికరాలు కొనుగోలు చేసేందుకు సబ్సిడీతో ప్రభుత్వం సాయం అందిస్తుంది. ఉదాహరణకు ఒక రోటవేటర్ కొనుగోలు చేయాలంటే దాని ధర లక్ష రూపాయలు అని అనుకుంటే ఎస్సీ ఎస్టీ మహిళా రైతులు కేవలం 50000 రూపాయలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన 50 వేల రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. అదే ఇతర కేటగిరీల రైతులు అయితే 40 శాతం సబ్సిడీని పొందుతారు అంటే వారికి 40 వేల రూపాయల సబ్సిడీ అందుతుంది. వారు 60 వేల రూపాయలు చెల్లించవలసి ఉంటుంది . వ్యవసాయ పరికరాల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే రైతులు వ్యవసాయ శాఖాధికారులను సంప్రదించాలి. రైతులు తమ ఆధార్, పాస్ బుక్, బ్యాంకు వివరాలు, సాయిల్ హెల్త్ కార్డులు, ఫోటోలు జతచేసి క్లస్టర్ ఏఈఓ లేదా మండల వ్యవసాయ అధికారి వద్ద దరఖాస్తులు చేసుకోవాలి. చిన్న సన్నకారు రైతాంగానికి కూడా యంత్ర పరికరాల కొనుగోలుకు సబ్సిడీపై రుణాలు అందిస్తూ తెలంగాణా ప్రభుత్వం రైతన్నకు బాసటగా నిలుస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)