15 అడుగుల ఎత్తు ఎగిరి నదిలో పడ్డ ట్రక్కు : వీడియో వైరల్‌

Telugu Lo Computer
0


మెరికాలోని మార్ష్‌ఫీల్డ్‌లో గ్రీన్ హార్బర్ టౌన్ పీర్ వద్ద ఆదివారం ఉదయం ఓ ట్రక్కు 15 అడుగుల ఎత్తు ఎగిరి నదిలో పడిపోయింది. ఈ సంఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. దీంతో ఆ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. అదృష్టవశాత్తూ ప్రమాదం సమయంలో నదిలో ఉన్న ఒక పడవ తృటిలో తప్పించుకుంది. డ్రైవర్ ట్రక్కు వెనుక విండో నుంచి దూకి ఈదుకుంటూ రావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తరువాత ట్రక్కును నది నుండి బయటకు తీశారు. బయటకు తీసే సమయంలో ట్రక్కు డ్యామేజ్‌ అయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందని, ట్రక్కు నదిలో ఉన్న పడవలోకి దాదాపుగా దూసుకెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానిక పోలీసులు చెప్పారు. అదృష్టవశాత్తూ ట్రక్కు పడిపోయిన చోట ఎవరూ లేరు. ఈ ఘటనపై నెటిజన్స్‌ రకరకాలుగా కామెంట్స్‌ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)