వీసా, ఇమ్మిగ్రేషన్ విధానాల సరళతరం !

Telugu Lo Computer
0


న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో విదేశీ విభాగం ఉన్నతాధికారులతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అధ్యక్షతన ఈరోజు సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వీసాల విధానాల సరళతరం, ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టుల ఆధునీకరణ వంటి అంశాలపై కీలక చర్చ జరిపారు. ఈ సందర్బంగా ఆయా అంశాల్లో పురోగతిని అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. వీసా విధానాన్ని సులభతరం చేసేందుకు అనేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గతంలో వీసా పొందేందుకు 26 సబ్ కేటగిరీలుండగా వాటిని 22కి కుదించామని, అట్లాగే గతంలో 104 సబ్ కేటగిరీలుంటే 69కి తగ్గించినట్లు వెల్లడించారు. 2024లో జారీ చేసిన మొత్తం వీసాలలో ఈ వీసాల వాటా వాటా 65.15 శాతం పేర్కొన్నారు. వీసా విధానాల సులభతరం వల్ల వీసా జారీ సగటు సమయం కొన్ని వారాల నుండి ఒక్క రోజుకే తగ్గినట్లు తెలిపారు. ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టుల ఆధునీకరణలో భాగంగా ఆటోమేటెడ్ ట్రావెల్ డాక్యుమెంట్ స్కానింగ్, బయోమెట్రిక్ నమోదు సదుపాయాలను కల్పించినట్లు అధికారులు పేర్కొన్నారు. 2014 నాటికి దేశంలో 82 ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టులుండగా, ప్రస్తుతం 114కి పెంచినట్లు వివరించారు. అట్లాగే ఢిల్లి, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, అహ్మదాబాద్‌లలో ఫాస్ట్-ట్రాక్ ఇమ్మిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రాం అమలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రీ-వెరిఫైడ్ ప్రయాణికులు ఈ విమానాశ్రయాల్లో కేవలం ఒకే ఒక్క నిమిషంలోనే ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ పొందవచ్చునని తెలిపారు. త్వరలో ఈ సౌకర్యాన్ని కోజికోడ్, లక్నో, తిరువనంతపురం, అమృత్సర్, తిరుచిరాపల్లి, నోయిడా, నవి ముంబై విమానాశ్రయాలకు విస్తరించనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు సుమారు 50 లక్షల ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డులు జారీ చేసినట్టు వెల్లడించారు. ఓసీఐ పోర్టల్‌ను పునరుద్ధరించి మరింత సులభమైన సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లకు చెందిన 6 నిర్దిష్ట మైనారిటీ సమూహాల పౌరసత్వ దరఖాస్తుదారులకు సాయం చేయడానికి "CAA-2019" మొబైల్ యాప్ అభివృద్ధి చేసినట్లు వివరించారు. ఈ సందర్బంగా అధికారుల పనితీరును అభినందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ వీసా, ఇమ్మిగ్రేషన్ విషయంలో ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)