రష్యాలో మళ్లీ భూకంపం : బద్దలైన అగ్నిపర్వతం

Telugu Lo Computer
0


ష్యాలో ఆదివారం కురిల్ దీవుల్లోని రిక్టర్ స్కేల్పై 7.0 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో రష్యాలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. భూకంప ప్రభావానికి ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం ఇంకా తెలియలేదు. అయితే పలు నగరాల్లో భవనాలు ఉగినట్లు రష్యా స్థానిక మీడియా వెల్లడించింది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసినట్లు పేర్కొంది. రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో క్రాషెన్నినికోవ్ అనే అగ్నిపర్వతం బద్ధలైంది. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. అయితే ఇటీవల వచ్చిన భారీ భూకంపం వల్ల దాదాపు 600 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ఈ అగ్నిపర్వతం బద్దలైనట్లు అధికారులు వెల్లడించారు. అగ్నిపర్వతం బద్ధలు కావడంతో బూడిద 6 వేల మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడినట్లు చెప్పారు. ఇక మరో ఘటనలో కమ్చట్కా ద్వీపకల్పంలోని అత్యంత చురుకైన మరో అగ్నిపర్వతం క్ల్యూచెస్కీ కూడా పేలిపోయింది.


Post a Comment

0Comments

Post a Comment (0)