డయాబెటిస్ , గుండె సంబంధిత వ్యాధులు, హైబీపీ, దీర్ఘకాలిక నొప్పులు వంటి జబ్బులతో పాటు 35 రకాల నిత్యావసర మందుల రిటైల్ ధరలను తగ్గిస్తున్నట్లు నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ ప్రజలకు మందులను మరింత అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో, జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ ఈ మందుల ధరలను తగ్గించింది. ఎసిలోఫెనాక్, పారాసెటమాల్, ట్రైప్సిన్ కైమోట్రిప్సిన్ ఫిక్స్‌డ్-డోస్ కాంబినేషన్, అమోక్సిసిలిన్-పొటాషియం క్లావ్యులానేట్, అటోర్వాస్టాటిన్, ఎంపాగ్లిఫ్లోజిన్, సిటాగ్లిప్టిన్, మెట్‌ఫార్మిన్ వంటి మందుల ధరలను తగ్గిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అంతేకాదు మెడికల్ షాప్ లో రిటైలర్లు, డీలర్లు తాజా ధరల జాబితాను స్పష్టంగా ప్రదర్శించాలని కూడా ఎన్పీపీఏ ఆదేశించింది. ఇక తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఫార్మసీ కంపెనీలు కొత్త ధరల జాబితాను ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో అప్డేట్ చెయ్యవలసి ఉంది. ఈ కొత్త ధరల జాబితా ఎన్పీపీ ఏ కి, రాష్ట్రాల డ్రగ్ కంట్రోలర్ కు సమర్పించాలని ఆదేశించింది.
35 రకాల నిత్యావసర మందుల రిటైల్ ధరల తగ్గింపు
August 04, 2025
0
Tags