ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ - మధుమేహం

Telugu Lo Computer
0


ఫ్రెంచ్ ఫ్రైస్ బంగాళదుంపల నుండి తయారవుతాయి. రుచిగా ఇష్టంగా తీసుకునే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ పరిమితికి మంచి తీసుకుంటే మధుమేహం తో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోవ టమేనని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతి వారం మూడు ప్లేట్ల ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం వల్ల టైప్-2 డయాబెటిస్ రిస్క్ 20% పెరుగుతుందని ఒక పరిశోధన వెల్లడించింది. ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కువగా తీసుకోవటం వలన వచ్చే అనారోగ్య సమస్యల పైన తాజా అధ్యయన నివేదిక కీలక అంశాలను వెల్లడించింది. ఉడికించిన లేదా కాల్చిన బంగాళాదుంపలతో అంత ప్రమాదం ఉండదని బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది. హార్వర్డ్‌, కేంబ్రిడ్జి యూనివర్సిటీల పరిశోధకులు ప్రారంభంలో మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్‌ లేని దాదాపు 2 లక్షల మంది నుంచి 40 ఏళ్లపాటు సేకరించిన డేటాను విశ్లేషించారు. ఈ క్రమంలో 40 ఏళ్ల తర్వాత వారిలో 22,300 మంది డయాబెటిస్‌ బారినపడినట్టు నివేదికలో వెల్లడించారు. వారానికి మూడుసార్లు ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ తీసుకున్న వారిలో మధుమేహం ప్రమాదం 20 శాతం పెరిగిందని గుర్తించినట్టు వెల్లడించారు. అయితే కాల్చిన లేదా ఉడికించిన బంగాళాదుంపలు తీసుకున్న వారికి ఎలాంటి సమస్యా ఎదురు కాలేదని పేర్కొన్నారు. బంగాళాదుంపల స్థానంలో తృణధాన్యాలను ఆహారంగా ఇచ్చినప్పుడు మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గినట్టు కనుగొన్నారు. కానీ.. బంగాళాదుంపలకు బదులుగా అన్నం తీసుకున్నవారిలో మధుమేహం ప్రమాదం పెరిగినట్టు గుర్తించారు. అయితే, పీచు, విటమిన్ సి, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు బంగాళదుంపలో ఉంటాయి. అవి అధిక మొత్తంలో స్టార్చ్ కలిగి ఉంటాయి. వాటి గ్లైసెమిక్ సూచిక కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, ఇది మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)