ట్రంప్‌కు భారీ షాకిచ్చిన బ్రిక్స్ దేశాలు

Telugu Lo Computer
0


మెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో మళ్లీ ట్రేడ్ వార్ కు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా ట్రంప్ సుంకాలన్నీ బ్రిక్స్ దేశాలు టార్గెట్ గా ఉన్నాయి. బ్రిక్స్ దేశాలపై భారీ స్థాయిలు సుంకాలను విధించారు. బ్రెజిల్, భారతదేశం వంటి దేశాలపై 50 శాతం టారిఫ్ విధిస్తూ కీలక నిర్ఱయం తీసుకున్నారు. ఈ దేశాలు రష్యా చమురు కొనుగోళ్లు ఆపడం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ ప్రభుత్వం తెలిపింది. గతంలోనే భారత్ మీద 25 శాతం సుంకాలు విధించి వైట్ హైస్ తాజాగా ఇండియా నుండి అమెరికాకు వచ్చే వస్తువులపై అదనంగా 5% సుంకాన్ని విధిస్తున్నట్లు ఉత్తర్వు జారీ చేసింది. దీంతో భారత్ మీద వేసిన సుంకాలు 50 శాతానికి చేరాయి. మరో బ్రిక్స్ దేశం బ్రెజిల్ నుంచి దిగుమతులపై కూడా డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలను అమలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ట్రంప్ ఆప్త మిత్రుడు జైర్ బోల్సోనారోపై జరుగుతున్న విచారణలపై వ్యతిరేకత అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ట్రంప్ తీసుకున్న ఈ చర్యలు బ్రిక్స్ దేశాల మధ్య ఆయనకు దూరాన్నిపెంచాయి. బ్రిక్స్ దేశాల మధ్య సంబంధాలు చిగురించేదుంకు దోహదపడుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా సుంకాల దాడులు బ్రిక్స్ దేశాల మధ్య ఐక్యతకు దారి తీసేలా కనిపిస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏడు సంవత్సరాల గ్యాప్ తర్వాత చైనాను సందర్శించనున్నట్లు ప్రకటించారు. ఈ పర్యటన న్యూఢిల్లీ, బీజింగ్ మధ్య గల ఉద్రిక్తతలను చల్చార్చే అవకాశం ఉంది. అదే సమయంలో.. బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా ట్రంప్ అదనపు సుంకాలపై ఉమ్మడి స్పందన కోసం చర్చించేందుకు భారతదేశం, చైనా నాయకులను పిలవాలని భావిస్తున్నట్లు తెలిపారు. బ్రిక్స్ అంతర్గతంగా చాలావరకు విభిన్న స్వభావం కలిగిన దేశాల సముదాయంగా చెప్పుకోవచ్చు. చారిత్రకంగా చూసుకున్నట్లయితే వీరి వాణిజ్య పరస్పర సంబంధాలు బలహీనంగా ఉన్నాయి. ఉదాహరణకు చెప్పాలంటే చైనా ఎగుమతులలో బ్రిక్స్ దేశాల వాటా కేవలం 9 శాతం మాత్రమే, ఇది US 15 శాతం వాటాగా ఉంది. అభివృద్ధి చెందుతున్న ఆసియాతో పోల్చితే తక్కువే కూడా చైనా వాటా తక్కువగానే ఉంది. అయినప్పటికీ ఇటీవల చైనా-రష్యా మధ్య వాణిజ్యం 244.8 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరుకోవడం చెప్పుకోదగ్గ పరిణామం. ట్రంప్ టారిఫ్ దూకుడుతో బ్రిక్స్ దేశాలు తాత్కాలికంగా ఏకమయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడి, కరెన్సీ వినియోగం రంగాలలో ఈ దేశాలన్నీ కలిసి పనిచేసే అవకాశం ఉంది. ఇదే సమయంలో దీర్ఘకాలికంగా చైనా ఆధిపత్యాన్ని భారతదేశం అంగీకరించదనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ప్రస్తుతానికి ట్రంప్ విధిస్తున్న సుంకాలు బ్రిక్స్ దేశాలకు మాత్రమే పరిమితం కావడం వల్ల.. ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ స్థానాన్ని సమర్థించుకునేందుకు పరస్పర మద్దతుతో ముందుకు సాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)