తమిళగ వెట్రి కళగం రెండో రాష్ట్ర సమావేశం మదురైలో జరిగింది. 2026 తమిళనాడు రాజకీయాల్లో తమ పార్టీ, డీఎంకే మధ్య పోటీ ఉంటుందని విజయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతోపాటు ఇతర పార్టీలతో పొత్తుల గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో మాట్లాడిన విజయ్. మా ఏకైక భావజాల శత్రువు బీజేపీ, మా రాజకీయ శత్రువు డీఎంకే అంటూ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ రెండు పార్టీలతో పొత్తు ఉండదన్నారు. తమిళగ వెట్రి కళగం ఒంటరిగా నిలబడుతుందని, ఎవరికీ భయపడదని స్పష్టం చేశారు. అడవిలో నక్కలు ఎన్ని ఉన్నా, సింహం ఒక్కటే రాజు అని.. దాని గర్జన చాలా దూరం వరకు వినిపిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో సింహం ఎప్పుడూ సింహమే అంటూ సమావేశంలో జనాలను ఉత్తేజపరిచారు.
మా భావజాల శత్రువు బీజేపీ - రాజకీయ శత్రువు డీఎంకే : విజయ్
August 21, 2025
0
Tags