ఏథర్ ఎనర్జీ ఈవీల విక్రయంలో సంచలనం సృష్టించింది. ఆగస్టు మొదటి 21 రోజుల్లో కంపెనీ 17 శాతం మార్కెట్ షేరుతో రెండో స్థానంలో నిలిచింది.దీనికి సంబంధించి ప్రభుత్వ పోర్టల్ వాహన్ తాజాగా నివేదిక ఇచ్చింది. 25 శాతం మార్కెట్ షేరుతో ప్రస్తుతం టీవీఎస్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. 16 శాతం మార్కెట్ షేరుతో ఓలా ఎలక్ట్రిక్ మూడో స్థానంలో నిలిచింది. దక్షిణ భారత్ మార్కెట్‌లో బలమైన పట్టున్న ఏథర్ ఇప్పుడు ఇతర రాష్ట్రాలకూ విస్తరిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్‌ల్లో కొత్త Rizta మోడల్ వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం కంపెనీకి 446 స్టోర్లు ఉండగా.. 2026 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 700 స్తోర్లు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇతర కీలక విజేతల్లో హీరో మోటోకార్ప్ మొదటిసారి టాప్-5కి వెళ్లింది. సరికొత్త విడా వీX2 లాంచ్ తర్వాత ఇది నేరుగా నాలుగో స్థానానికి దూసుకెళ్లింది. ఈ మోడల్ ధర సుమారు.82వేలు. అయితే కంపెనీ వినియోగదారుల కోసం 'బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్ ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. అంటే వారు బ్యాటరీ ధరను పూర్తిగా చెల్లించాల్సిన అవసరం లేకుండా వాహన ధర రూ.57 వేలకి తగ్గుతుంది. మరోవైపు బజాజ్ ఆటో మార్కెట్ షేరు 12 శాతానికి పడిపోయింది. గత కొన్ని నెలలుగా కంపెనీ 20 శాతం మార్కెట్ షేరుతో ఉంది. అయితే ఆగస్టు 27 నుంచి మహారాష్ట్రలో ప్రారంభమవనున్న వినాయక చవితి సీజన్‌లో బజాన్‌కు కొంత లాభాలు రావచ్చని అంచనా. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన అమ్మకాలు నెలకు సుమారు లక్ష యూనిట్ల వద్ద కొనసాగుతున్నాయి. లక్షలోపు ధర కలిగిన కొత్త మోడళ్ల వల్ల వృద్ధి బలంగా కనిపిస్తోంది. ఇకపై కొత్త ఫీచర్లు, BAAS వంటి స్కీమ్స్‌తో కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి.
ఈవీ అమ్మకాల రేస్‌లో రెండో స్థానంలో నిలిచిన ఏథర్
August 21, 2025
0
Tags