భారత్‌లో ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్‌ జారీ చేసిన టిక్‌టాక్‌

Telugu Lo Computer
0


టిక్‌టాక్‌ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. గురుగ్రామ్‌లోని తన ఆఫీస్‌లో రెండు ఖాళీలను భర్తీ చేయనున్నట్లు పోస్ట్‌ చేసింది. వీటిలో ఒకటి కంటెంట్‌ మోడరేటర్‌ (బెంగాలీ మాట్లాడగల అభ్యర్థి), మరొకటి మంచి భాగస్వామ్యం, కార్యకలాపాల నాయకత్వానికి సంబంధించిన పోస్టు. భారత్‌లో ఇటీవల టిక్‌టాక్‌ వెబ్‌సైట్‌ అనేకమంది యాక్సెస్‌ చేయగలుగుతున్నారు. అయితే దానిలోకి లాగిన్‌ కావడం, వీడియోలను చూడటం సాధ్యం కావడంలేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం టిక్‌టాక్‌పై ఇప్పటికీ నిషేధం కొనసాగుతోందని స్పష్టం చేసింది. భారత్‌లో టిక్‌టాక్‌ సేవలను పునరుద్ధరించేందుకు ఎటువంటి ఆదేశాలు జారీ కాలేదని అధికారులు తెలిపారు. గతంలో టిక్‌టాక్‌ వెబ్‌సైట్‌ ల్యాండింగ్‌ పేజీలో భారత్‌లో దాని సేవలు అందుబాటులో లేవనే సందేశాన్ని చూపించేది. అయితే తాజాగా డెస్క్‌టాప్‌లో యాక్సెస్‌ చేస్తే 'అబౌట్‌ అజ్‌' పేజీ ఓపెన్‌ అవుతోంది. కానీ వీడియోలు మాత్రం కనిపించడం లేదు. యాప్‌ కూడా ఆండ్రాయిడ్‌ ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్‌ చేయడానికి అందుబాటులో లేదు. భారత్‌లో టిక్‌టాక్‌ సేవలను మేము పునరుద్ధరించడం లేదని, భారత ప్రభుత్వ ఆదేశాలను కచ్చితంగా పాటిస్తున్నామని టిక్‌టాక్‌ ప్రతినిధి తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)