హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగు రోడ్డుకు సుమారు 40 కి.మీ దూరంతో రెండు భాగాలుగా ఆర్ఆర్ఆర్ రోడ్డును నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఉత్తర భాగం నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో పాటుగా టెండర్లు కూడా పిలిచింది. ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్‌పై హెచ్‌ఎండీఏ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. వంద మీటర్ల వెడల్పుతో ఈ రోడ్డును నిర్మించనున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల ఎనిమిది జిల్లాల మీదుగా వెళ్తుంది. ఈ నోటిఫికేషన్‌లో డిజిటల్ మ్యాప్‌తో పాటు, ఆర్‌ఆర్‌ఆర్ వెళ్లే సర్వే నంబర్ల వివరాలను కూడా వెల్లడించారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ ప్రాజెక్టు కింద రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వికారాబాద్, నల్గొండ, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, యాదాద్రి-భువనగిరి జిల్లాల పరిధిలోని 33 మండలాలు, 163 రెవెన్యూ గ్రామ పంచాయతీలను కవర్ చేయనుంది. ఈ ప్రాజెక్టు వల్ల ఆయా ప్రాంతాల్లోని భూములకు విలువ పెరగడంతో పాటు, రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని అధికారులు భావిస్తున్నారు. ప్రాథమిక నోటిఫికేషన్‌పై ప్రజలు, సంస్థల నుంచి అభ్యంతరాలు, సూచనలను హెచ్‌ఎండీఏ ఆహ్వానిస్తోంది. సెప్టెంబర్ 15వ తేదీలోగా తమ అభ్యంతరాలను రాతపూర్వకంగా హెచ్‌ఎండీఏ కమిషనర్‌కు సమర్పించవచ్చు. ఈ సూచనలను పరిశీలించిన తర్వాత తుది నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని హెచ్‌ఎండీఏ తెలిపింది. ప్రాథమిక నోటిఫికేషన్, డిజిటల్ మ్యాప్, ఇతర వివరాలు శనివారం నుంచి హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
హైదరాబాద్ ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్‌పై హెచ్‌ఎండీఏ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల
August 31, 2025
0
Tags