మహిళలకు గ్రౌండ్ బుకింగ్ ఉన్న బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు గ్రౌండ్ బుకింగ్ ఉన్న బస్సుల్లో కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించబోతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గ్రౌండ్ బుకింగ్ బస్సులంటే కొన్ని ప్రత్యేక బస్సుల్లో కండక్టర్లు ఉండరు. అలానే ఇవి 2, 3 స్టాపుల్లో మాత్రమే ఆగుతాయి. వీటికి ఆయా బస్టాండ్లలో మాత్రమే టికెట్ జారీ చేస్తారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఇలాంటి బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబోతున్నట్లు తెలిపింది. గ్రౌండ్ బుకింగ్ కింద నడిపే పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. వీటిల్లో కూడా మహిళలకు ఉచిత బస్సు పథకం వర్తిస్తుందని అధికారులు తెలిపారు. అలానే సింహాచలం కొండపైకి వెళ్లే సిటీ బస్సులకు టోల్ ఫీజు మినహాయించాలని కోరుతూ ఆర్టీసీ అధికారులు దేవస్థానం ఈవోకు లేఖ రాశారు. రాష్ట్రంలో తిరుమల మినహా మిగతా 39 ఘాట్ రోడ్లపై తిరిగే బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇదిలా ఉండగా, బొబ్బిలి నుంచి విశాఖపట్నం వెళ్తున్న బస్సులో ఇద్దరు ప్రయాణికులు సీటు విషయంలో బూతులు తిట్టుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా బొబ్బిలి నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ బస్సులో సీటు కోసం ఇద్దరు ప్రయాణికులు గొడవపడ్డారు. బూతులు తిట్టుకున్నారు. ఇక్కడ గొడవ పడింది మహిళలు కాదు. సీటు విషయంలో ఒక వ్యక్తి, ఒక మహిళ ఇద్దరూ పరస్పరం బూతులు తిట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అయితే దీనిపై ఆర్టీసీ అధికారులు స్పందించారు. తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించిన ఈ ఇద్దరు ప్రయాణికుల మీద పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని పార్వతీపురం డిపో అధికారులను ఆదేశించారు. అలానే ఇక మీదట ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఉచిత ప్రయాణం నేపథ్యంలో రద్దీ పెరుగుతుండటంతో ప్రభుత్వం కొత్త బస్సులను సమకూర్చే పనిలో ఉంది.


Post a Comment

0Comments

Post a Comment (0)