శ్రీవాణి దర్శన కోటా టికెట్లు పెంపు !

Telugu Lo Computer
0


టీటీడీ శ్రీవాణి దర్శనం విషయంలో కీలక మార్పులకు సిద్దం అయింది. ఇప్పటికే శ్రీవాణి దర్శనం టికెట్ల జారీ కేంద్రాన్నిఅదనపు ఈవో కార్యాలయం వెనుక నుంచి అన్నమయ్య భవన్ ఎదురుగా ఉన్న భవనంలోకి మారుస్తున్నారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా శ్రీవాణి దర్శనం టికెట్ల జారీ కేంద్రాన్ని అదనపు ఈవో కార్యాలయం వెనుక తాత్కాలికంగా జర్మన్ షెడ్లలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు దానిని శాశ్వతంగా అన్నమయ్య భవన్ ఎదురుగా ఉన్న భవనంలోకి మారుస్తున్నారు. కొత్త టికెట్ల జారీ కేంద్రంలో క్యూలైన్లు, ఫర్నీచర్ ఏర్పాటు చేశారు. ఇక, ఇప్పుడు శ్రీవాణి టిక్కెట్ల కోసం భక్తుల నుంచి భారీగా డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో టికెట్ల కోటాను పెంచాలని టీటీడీ నిర్ణయించింది. తాజా నిర్ణయం మేరకు 1500 టిక్కెట్ల కోటాను 2వేల టికెట్లకు పెంచాలని డిసైడ్ అయిది. అదే విధంగా ఇకపై ప్రతి రోజు కరెంటు బుకింగ్ కోటా క్రింద తిరుమలలో 2వేల టిక్కెట్లు, రేణిగుంట విమానాశ్రయంలో 400 టిక్కెట్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో శ్రీవాణి దర్శన సమయంలో కూడా టీటీడీ మార్పులు చేసింది. ప్రస్తుతం ఉదయం శ్రీవాణి టికెట్స్ కలిగిన భక్తులను దర్శనానికి అనుమతిస్తుండగా ఇకపై సాయంత్రం దర్శనానికి కూడా అనుమత ఇవ్వాలని డిసైడ్ అయింది. దీని ద్వారా గదులకు నెలకొని ఉన్న డిమాండ్ తగ్గుతోందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. ఆఫ్ లైన్, ఆన్ లైన్ శ్రీవాణి టికెట్లను పొందిన భక్తులకు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 వద్ద సాయంత్రం 4.30 లకు రిపోర్టింగ్ సమయం కేటాయిస్తోంది. ఈ మేరకు టీటీడీ అధికారికంగా నిర్ణయం వెల్లడించనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)