పవన్ కళ్యాణ్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై  'హరిహర వీరమల్లు' సినిమా ప్రమోషన్ల కోసం ప్రభుత్వ నిధులను ఉపయోగించారని ఆరోపిస్తూ మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.  ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని, నిధుల దుర్వినియోగం జరిగిందా లేదా అనేది సమగ్రంగా బయటపడాలని విజయ్ కుమార్ పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే అవసరమైతే ఏసీబీ దర్యాప్తు కూడా జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పిటిషన్‌పై ప్రాథమిక విచారణ జరిపిన హైకోర్టు, కేసు విచారణ జాబితాలో సీబీఐ, ఏసీబీ న్యాయవాదుల పేర్లు చేర్చాలని రిజిస్ట్రీకి ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.


Post a Comment

0Comments

Post a Comment (0)