కేంద్రం ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ను నేరంగా పరిగణిస్తూ 'ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు'ను తీసుకురాబోతోంది. దీనికి ప్రధాని మోడీ నేతృత్వంలో మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర వేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ బిల్లును బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బెట్టింగ్ యాప్స్ ఆగడాలు ఇటీవల కాలంలో పెచ్చరిల్లుతున్నాయి. ఈ యాప్స్‌కు బానిసలై కొందరు అప్పుల ఊబిలో చిక్కుకోగా, మరికొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. పలువురు సినీ, క్రీడా ప్రముఖులు ఈ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు దర్యాప్తు సంస్థల నుంచి విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ యాప్స్‌పై నిషేధం ఉంది. అయినప్పటికీ నిఘా వ్యవస్థల కళ్లుగప్పి కొందరు వీటిని వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్స్‌పై చర్యలకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
గేమింగ్ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం ?
August 19, 2025
0
Tags