ఆ అణుబాంబును పేల్చనివ్వండి, అది పేలేటప్పుడు దానివల్ల తనకు హాని కలగకుండా చూసుకోవాలి !

Telugu Lo Computer
0


న్నికల సంఘం, భాజపాపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆ అణుబాంబును పేల్చనివ్వండని వ్యాఖ్యానించారు. ''తనవద్ద అణుబాంబు ఉందని రాహుల్ గాంధీ అన్నారు. అయితే ఆయన దానిని వెంటనే పేల్చాలి. అది పేలేటప్పుడు దానివల్ల తనకు హాని కలగకుండా చూసుకోవాలి. గతంలో భూకంపం అంటూ హెచ్చరికలు చేశారు. కానీ తర్వాత అది తుస్సుమంది'' అని అన్నారు. రాజ్యాంగబద్ధమైన సంస్థ (ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి)పై ఇలాంటి ప్రకటనలు చేయడం ప్రతిపక్ష నేతకు తగదని మండిపడ్డారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. అనంతరం ముసాయిదా ఓటరు జాబితాను ఈసీ నేడు విడుదల చేసింది. అయితే, ఈ ప్రక్రియను ముందు నుంచీ వ్యతిరేకిస్తోన్న కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ''రాష్ట్ర స్థాయి నుంచి ఓట్ల చౌర్యం జరుగుతోందని మేం ఎప్పటినుంచో అనుమానిస్తున్నాం. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రతో పాటు లోక్‌సభలో ఎన్నికల్లోనూ అక్రమాలు జరిగాయి. ఓటరు సవరణ చేపట్టి కోట్లాది మంది కొత్త ఓటర్లను అదనంగా చేరుస్తున్నారు. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేస్తే ఈసీ గురించి బయటపడింది. ఆరు నెలల పాటు మేం సొంతంగా దర్యాప్తు జరిపి ఆటం బాంబు లాంటి ఆధారాలను గుర్తించాం. ఆ బాంబు పేలిన రోజు ఎన్నికల సంఘం దాక్కోవడానికి అవకాశమే ఉండదు'' అని కాంగ్రెస్‌ ఎంపీ ఆరోపించారు. మరో సందర్భంలో దేశంలో ఎన్నికల వ్యవస్థ పూర్తిగా కూలిపోయిందని రాహుల్‌ అన్నారు. ఎన్నికల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ చాలా తక్కువ మెజారిటీతో మూడోసారి ప్రధానిగా గెలుపొందారని అన్నారు. మరో 15 సీట్లు రాకపోయుంటే మోడీ ప్రధాని కాకపోయేవారని పేర్కొన్నారు. భాజపాకు ప్రయోజనం చేకూర్చడానికి ఎన్నికల సంఘం ఓట్ల దొంగతనంలో పాలుపంచుకుందని ఆరోపించారు. 2014 నుంచి ఏదో తప్పు జరుగుతోందని తనకు అనిపిస్తోందని.. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల పైనా అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)