హైదరాబాద్ లోని హెచ్‌ఐసీసీలో జరిగిన తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్‌లో 'తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ'ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించి మాట్లాడుతూ ప్రపంచంతో పోటీ పడాలనే స్పోర్ట్స్ పాలసీని తీసుకువస్తున్నామని అన్నారు. క్రీడా విధానం లేకపోవడం వల్ల పట్టణ ప్రాంతాల్లోని యువత పెడదోవ పడుతున్నారని, క్రీడలను ప్రోత్సహించకపోవడం వల్లే యువత డ్రగ్స్ తీసుకుంటున్నారన్నారు. దేశంలో నూతన విధానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రపంచంతో పోటీపడే మనం.. క్రీడల్లో వెనకబడి ఉండడం బాగాలేదన్నారు. భారత్‌కు బలమైన క్రీడా వేదిక కావాలని.. అందులో తెలంగాణ ప్రధానంగా ఉండాలని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
'తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ'ని ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి
August 02, 2025
0
Tags