విడుదలకు రెండు రోజుల ముందే రెండు మిలియన్ల క్లబ్‌లో చేరిన 'కూలీ'

Telugu Lo Computer
0


జనీకాంత్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజ్ దర్శకత్వంలో రానున్న చిత్రం 'కూలీ' విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్రీ బుకింగ్స్‌ ఓపెన్‌ చేయడంతో టికెట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యాయి. దీంతో ఓవర్సీస్‌లో రికార్డు నమోదైంది. విడుదలకు రెండు రోజుల ముందే 'కూలీ' రెండు మిలియన్ల క్లబ్‌లో చేరిపోయింది. ప్రీమియర్స్‌లోనే ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన మొదటి తమిళ సినిమాగా రికార్డు నెలకొల్పింది. 2016లో రజనీకాంత్‌ నటించిన 'కబాలి' నార్త్‌ అమెరికాలో విడుదలకు ముందే 60 వేల డాలర్లు వసూళ్లు చేసిన మొదటి తమిళ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు మళ్లీ తొమ్మిదేళ్ల తర్వాత ఆయన రికార్డును ఆయనే బ్రేక్‌ చేశారు. సూపర్‌స్టార్‌ రికార్డును బ్రేక్‌ చేయడం మళ్లీ ఆయనకే సాధ్యమని అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'కూలీ' ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నాగార్జున, ఆమిర్‌ఖాన్, ఉపేంద్ర, శ్రుతిహాసన్‌, సత్యరాజ్, సౌబిన్‌షాహిర్, మహేంద్రన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. తాజాగా విడుదల చేసిన పాటలు, ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)