విజయవాడ లోని మొగల్రాజపురానికి చెందిన ఒక వ్యక్తి (52) చరవాణి నంబరును గత నెల 15న 'అంకిత ఘోష్, కిరణ్ మెహతా' అనే ఇద్దరు వ్యక్తులు '83 బాబ్ క్యాప్స్ గ్రూప్'లో చేర్చారు. ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ చేస్తే.. కళ్లు చెదిరే లాభాలు వస్తాయని నమ్మించారు. వారి మాటలు నమ్మిన సదరు వ్యక్తి.. బాబ్ క్యాప్స్‌లో పేరు రిజిస్టర్ చేసుకున్నారు. అది పూర్తికాగానే ఆయనకు కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చింది. కొన్ని బ్యాంకు ఖాతాల నంబర్లు పంపారు. వ్యాపార నిమిత్తం దానిలో లావాదేవీలు నిర్వహించాలని చెప్పడంతో వారి మాటలు నమ్మి 9 రోజుల్లో విడతల వారీగా రూ.60లక్షలు ఆయా నంబర్లకు పంపించారు. ఈ డబ్బులు రాగానే సైబర్ నేరగాళ్లు బోర్డు తిప్పేశారు. బాధితుడు మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. ఆ నగదు మూడు వేర్వేరు బ్యాంకులకు వెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. విశాఖపట్నం జిల్లా యలమంచిలిలోని ఒక జాతీయ బ్యాంకు ఖాతా, హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంకు ఖాతాకు, పశ్చిమ బెంగాల్ లోని రాయ్‌గంజ్‌లో ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకుకు ఈ డబ్బులు బదిలీ అయినట్లు తేలింది. ఆయా బ్యాంకు ఖాతాల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రూ.60 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు !
August 12, 2025
0
Tags