ఈఎస్ఐ స్కీమ్ కింద ప్రయోజనాలు పొందడానికి ఆధార్ ధృవీకరణ తప్పనిసరి కాదని కార్మిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈఎస్ఐ స్కీమ్ నెలకు రూ. 21,000 వరకు జీతం పొందే ఉద్యోగుల కోసం రూపొందించబడింది. ఈ స్కీమ్ ద్వారా ఆసుపత్రి ఖర్చులు, డాక్టర్ సంప్రదింపులు, మందులు కవర్ అవుతాయి. గర్భిణీ స్త్రీలకు ఆర్థిక, వైద్య సహాయం అందుతుంది. జీవనోపాధి కోల్పోయినప్పుడు కొంత ఆర్థిక భరోసా కలుగుతోంది. ఆగస్టు 18న కార్మిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం, ఆధార్ ధృవీకరణ లేకపోయినా ఈఎస్ఐ ప్రయోజనాలు ఎవరికీ నిరాకరించబడవు. అంటే, సభ్యుడికి ఆధార్ కార్డు లేకపోయినా లేదా ఆధార్ లింక్ లేకున్నా కూడా వైద్య సహాయం, నగదు ప్రయోజనాలు సజావుగా అందుతాయి. ఈ క్రమంలో సభ్యుడు ఆధార్ బదులు వేరే గుర్తింపు కార్డులను (పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్) ఉపయోగించుకోవచ్చు. ఆధార్ ధృవీకరణ తప్పనిసరి కాకపోయినా, దాన్ని ఉపయోగించడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విషయం కూడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆధార్ లింక్ చేస్తే ఒక్క ఆధార్‌తో చాలా పనులు సులభంగా జరుగుతాయి. సభ్యుడికి సహాయం త్వరగా అందుతుంది. ఒకే వ్యక్తి పేరుతో రెండుసార్లు ప్రయోజనాలు తీసుకునే అవకాశం తగ్గుతుంది. రికార్డులు సరిగ్గా ఉంటాయి, పారదర్శకత పెరుగుతుంది. ఈఎస్ఐ స్కీమ్‌ను మరింత విస్తరించడానికి, మరింత మంది ఉద్యోగులు, యజమానులు ఈ స్కీమ్‌లో చేరేలా చేయడానికి ఈఎస్ఐసీ రెండు కొత్త స్కీమ్‌లను ప్రకటించింది.
ఈఎస్ఐ ప్రయోజనాలకు ఆధార్ తప్పనిసరి కాదు : కార్మిక మంత్రిత్వ శాఖ
August 22, 2025
0
Tags