ఆంధ్రప్రదేశ్ లో పేద విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత విద్య

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో పేద విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్లలో ఉచితంగా విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఇందులో భాగంగా విద్యా సంవత్సరం 2025-26కు సంబంధించి విద్యాహక్కు చట్టం కోటా సీట్ల భర్తీకి అదనపు నోటిఫికేషన్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్, అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం కింద పేద, బలహీన వర్గాల పిల్లలకు ఉచితంగా విద్యనందించేందుకు 25శాతం సీట్లను కేటాయిస్తుంది. అయితే 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ సీట్ల భర్తీకోసం గతంలో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, ఒకటవ తరగతిలో కేటాయించిన 25శాతం సీట్లలో మిగిలిన ఖాళీల భర్తీకి అదనపు నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు అడ్మిషన్ల కోసం ఆగస్టు 12 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌కు ఇది కొనసాగింపుగా ఉంటుందని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)