నీతా అంబానీ గ్యాలరీలోకి ఆడి A9 చమేలియన్ !

Telugu Lo Computer
0


నీతా అంబానీ ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ మాత్రమే కాకుండా ఆటోమొబైల్ కలెక్షన్ విషయంలో అభిరుచి చర్చా వేదికగా మారుతోంది. తాజాగా భారతదేశంలోనే అత్యంత ఖరీదైన కారు ఆడి A9 చమేలియన్ ను ఆమె కొనుగోలు చేశారు. ఈ కారు దాదాపు రూ. 100 కోట్ల విలువ కలిగిన లగ్జరీ మాస్టర్‌పీస్. ఆడి A9 చమేలియన్ ప్రపంచవ్యాప్తంగా కేవలం 11 యూనిట్లు మాత్రమే కలిగి ఉన్న హైపర్-ఎక్స్‌క్లూజివ్ మోడల్. ఈ కారు పేరు 'చామెలియన్' అనబడటానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక్క బటన్ నొక్కగానే బాడీ కలర్‌ను మార్చే సాంకేతికత ఇందులో ఉంది. స్పెషల్ ఎలక్ట్రో-పెయింట్ టెక్నాలజీతో రూపొందించిన ఈ ఫీచర్ వలన కారు ప్రతి సారి కొత్తగా కనిపిస్తుంది. రంగు మారినప్పుడల్లో కొత్త కారా అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇది కేవలం కలర్‌ మాత్రమే కాదు, డిజైన్ పరంగా కూడా భవిష్యత్‌తరహా ఆకర్షణ కలిగి ఉంది. సింగిల్-పీస్ విండ్‌స్క్రీన్, రూఫ్, స్పేస్‌షిప్‌లా ఉండే స్లీక్ ప్రొఫైల్, దాదాపు 5 మీటర్ల పొడవు, ప్రత్యేకమైన రెండు డోర్ల కాన్ఫిగరేషన్ వంటి ఫీచర్లు ఈ కారును మరింత ఆకర్షణీయంగా మలుస్తున్నాయి. ఆడి A9 చమేలియన్ లో 4.0-లీటర్ V8 ట్విన్-టర్బో ఇంజిన్ అమర్చారు. ఇది 600 హార్స్‌పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 0 నుండి 100 కి.మీ. వేగాన్ని కేవలం 3.5 సెకన్లలో చేరుకోగలదు. గరిష్ట వేగం గంటకు 250 కి.మీ.గా ఉంది.అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్స్, ప్రీమియం ఇంటీరియర్స్, హై-టెక్ ఇన్ఫోటైన్‌మెంట్ వంటి ఫీచర్లు ఈ కారును లగ్జరీ లోకి తీసుకువెళుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)