'వ్యూహం' సినిమా నిర్మాత దాసరి కిరణ్‌ అరెస్ట్‌

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ పోలీసులు 'వ్యూహం' సినిమా నిర్మాత దాసరి కిరణ్‌ను అరెస్ట్‌ చేశారు. ఆర్థిక లావాదేవీల విషయంలో నమోదైన ఫిర్యాదుతో విజయవాడ పటమట పోలీసులు హైదరాబాద్‌లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విజయవాడకు తరలించారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఉంటున్న దాసరి కిరణ్‌ బంధువు గాజుల మహేశ్‌ ట్రావెల్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఆయన వద్ద నుంచి కిరణ్‌ రూ.4.5కోట్లు అప్పుగా తీసుకున్నారు. తిరిగి ఇవ్వాలని మహేశ్‌ అనేక సార్లు అడిగినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఈనెల 18న విజయవాడలోని కిరణ్‌ కార్యాలయానికి మహేశ్‌, ఆయన భార్య వెళ్లారు. అక్కడ కిరణ్‌ అనుచరులు దాదాపు 15 మంది వారిపై దాడి చేశారు. దీంతో మహేశ్‌ విజయవాడ పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)