టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో 12 వేల మంది ఉద్యోగులను తొలగించాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా చెన్నైలో మంగళవారం యునైట్ ఆధ్వర్వంలో యూనియన్ నాయకులు ఆందోళన చేపట్టారు. టీసీఎస్‌కు వ్యతిరేకంగా ఈ సందర్భంగా బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. టీసీఎస్ సీనియర్, మేనేజర్ స్థాయి ఉద్యోగులను తొలగిస్తోందని, ఈ ప్రక్రియలో సుమారు 30 వేల నుంచి 40 వేల మందిపై ప్రభావం పడుతుందని యునైట్ సభ్యురాలు జనని ఆవేదన వ్యక్తంచేశారు. అనుభవజ్ఞుల స్థానంలో కొత్తగా చేరిన ఫ్రెషర్లను 80-85 శాతం తక్కువ జీతానికి నియమించుకుంటోందని యునైట్ ఆరోపిస్తోంది. ఉద్యోగులను తొలగించే బదులు వారి నైపుణ్యాలను పెంచాలని డిమాండ్ చేసింది. రూ.2.55 లక్షల కోట్ల ఆదాయం కలిగిన కంపెనీ.. లాభార్జన కోసం ఉద్యోగులను తొలగించడం అన్యాయమని పేర్కొంది. యునైట్ ఆరోపణలపై టీసీఎస్ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. 30 వేల మందిని తొలగిస్తున్నారన్న ఆరోపణలను ఖండించింది. 'ఈ ఊహాగానాలు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయి. ముందుగా చెప్పినట్లే మా ఉద్యోగుల సంఖ్యలో 2 శాతం.. అంటే దాదాపు 12 వేల మందికి పైగా మాత్రమే తొలగించనున్నాం' అని టీసీఎస్ పేర్కొంది.
టీసీఎస్ ఉద్యోగుల తొలగింపుపై యూనియన్ నాయకులు ఆందోళన
August 20, 2025
0
Tags