చట్ట సభలు ప్రజాసమస్యలపై చర్చలు జరపడానికే గానీ రాజకీయ లబ్ధి పొందేలా వ్యవహరించడానికి కాదు !

Telugu Lo Computer
0


ఢిల్లీలో జరుగుతున్న 'ఆల్‌ ఇండియా స్పీకర్స్‌ సమావేశం'లో కేంద్రమంత్రి అమిత్‌ షా పాల్గొని మాట్లాడుతూ చట్ట సభలు ప్రజాసమస్యలపై చర్చలు జరపడానికే గానీ రాజకీయ లబ్ధి పొందేలా వ్యవహరించడానికి కాదని అన్నారు. పార్లమెంట్‌లో జరిగే చర్చలు దేశాభివృద్ధిని ప్రభావితం చేస్తాయని చెప్పారు. చర్చలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. ఇటీవల జరిగిన పార్లమెంట్‌ సమావేశాలు విపక్షాల కారణంగా సజావుగా జరగలేదు. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. దీని గురించి ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆలోచించాలి. అర్థవంతమైన చర్చలు జరగాలి. సభా గౌరవాన్ని, స్పీకర్ పదవి గౌరవాన్ని పెంపొందించడానికి కృషి చేయాలి. ప్రజాసమస్యలపై నిష్పాక్షపాతమైన చర్చలు జరపడానికి చట్ట సభలను వేదికగా మార్చుకోవాలి. వాటి నిబంధనల మేరకు సమావేశాలు జరిగేలా చూడాలి''అని అన్నారు. సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీకి తొలి భారతీయ స్పీకర్‌గా పనిచేసిన విఠల్‌భాయ్‌ పటేల్‌కు కేంద్రమంత్రి అమిత్‌ షా నివాళులర్పించారు. వందేళ్ల క్రితం స్పీకర్‌గా విఠల్‌భాయ్‌ పటేల్‌ ఎన్నికతోనే దేశంలో పార్లమెంటరీ చరిత్ర మొదలైందన్నారు. అప్పటి బ్రిటిష్‌ పాలనలో 1919 డిసెంబర్‌ 24న దేశంలో సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ ఏర్పాటైంది. 1925లో విఠల్‌భాయ్‌ పటేల్ ఈ సభకు స్పీకర్‌గా ఎన్నికయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)