కారులో కొకైన్‌ తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్‌

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లో కారులో కొకైన్‌ తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎక్సైజ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ అరెస్ట్‌ చేసింది. నారాయణగూడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్.అంజిరెడ్డి వెల్లడించారు. రామ్‌కోఠిలోని వర్ధమాన్‌ బ్యాంక్ వద్ద చేపట్టిన తనిఖీల్లో ఇన్నోవా కారులో కొకైన్‌ తరలిస్తుండగా ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు. నాంపల్లికి చెందిన మిస్బాహిద్దీన్ ఖాన్, బంజారాహిల్స్‌కు చెందిన అలీ అస్గర్ గులాబీ, జుబైర్ అలీ (యూఎస్‌ఏ సిటిజన్)ను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి 33.3 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)