విజయవాడలో నిర్వహించిన 'గ్రీన్ ఎనర్జీ' కాన్ఫరెన్స్‌లో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ సమాజంలో నిత్యం మార్పులు వస్తున్నాయని, వాటిని స్వీకరిస్తేనే మెరుగైన ఉపాధి అవకాశాలుంటాయని అన్నారు. కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటమ్ కంప్యూటింగ్‌లో మరింత నైపుణ్యం పెంచుకోవాలన్నారు. కొన్ని కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వ ఐటీఐలను దత్తత తీసుకొని, ఆధునిక సాంకేతికతపై శిక్షణ ఇస్తున్నాయని తెలిపారు. 20లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నాం. నా పాదయాత్రలో ఎక్కడ చూసినా మహిళా ఉద్యోగులు కనిపించారు. కియా వచ్చాక వేలమంది మహిళలకు ఉపాధి దొరికింది. పిల్లలను బాగా చదివించుకునేందుకు మహిళలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగాలు చేస్తేనే ఇంటా బయటా వారికి గౌరవం పెరుగుతుందని మంత్రి లోకేశ్ అన్నారు.
కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటమ్ కంప్యూటింగ్‌లో మరింత నైపుణ్యం పెంచుకోవాలి !
August 06, 2025
0
Tags