హైదరాబాద్ లో ఎలి లిల్లీ ఇన్నోవేషన్ కేంద్రం ప్రారంభం

Telugu Lo Computer
0


హైదరాబాద్ లో అమెరికాకు చెందిన ఫార్మాస్యూటికల్ దిగ్గజం ఎలి లిల్లీ అండ్ కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించింది.టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌ను ఆగస్టు 4న అధికారికంగా ప్రారంభించింది. ఇది సంస్థ గ్లోబల్ డిజిటల్, డేటా, ఏఐ కార్యకలాపాలకు ఒక వ్యూహాత్మక కేంద్రంగా ఉండనుందని కంపెనీ తెలిపింది. నగరంలోనిలో గచ్చిబౌలిలోని ఫీనిక్స్ ఈక్వినాక్స్ క్యాంపస్‌లో 2.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ సెంటర్ ద్వారా లిల్లీ ఇప్పటికే వంద మంది నిపుణులను నియమించుకుంది. వచ్చే 2-3 ఏళ్లలో 1,500 మంది ఉద్యోగుల నియామకాన్ని ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కంపెనీలోని పనితీరు ముఖ్యంగా ఏఐ, ఆటోమేషన్, క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ విభాగాలపై ప్రధానంగా ఉండనుంది. ఈ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఎలి లిల్లీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఇన్ఫర్మేషన్ & డిజిటల్ ఆఫీసర్ డియోగో రౌ మాట్లాడుతూ మేము హైదరాబాద్‌ను ఒక సహజ భాగస్వామిగా చూస్తున్నాం. ఇక్కడ ఉన్న సాంకేతిక నైపుణ్యం, టాలెంట్, సహకార మంత్రం మమ్మల్ని ఆకర్షించిందని తెలిపారు. లిల్లీ యొక్క డిజిటల్.. ఫార్మా రంగానికి ఓ బలమైన మద్దతును అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కొత్త కేంద్రం సంస్థ యొక్క "ల్యాబ్ నుండి రోగికి" ప్రయాణాన్ని వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషించనుంది. అంటే ఔషధ పరిశోధన.. అభివృద్ధితో పాటుగా మార్కెట్ విడుదల ప్రక్రియలు డిజిటల్ మద్దతుతో మరింత సమర్థవంతంగా మారనున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచ కేంద్రంగా ఎదుగుతోందని తెలిపారు. ఎలి లిల్లీ వంటి దిగ్గజ సంస్థ ఇక్కడ తమ సెంటర్‌ను ఏర్పాటు చేయడం రాష్ట్రానికి గౌరవకరమైన విషయంగా పేర్కొన్నారు. ఇది రాష్ట్రంలో ఉన్న అనుకూల వ్యాపార వాతావరణానికి నిదర్శనమని తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)