మహాదేవుని ఆశీస్సులతో పహల్గామ్‌ దాడిపై ప్రతీకారం తీర్చుకున్నాం !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్ లోని  వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించి మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య సంరక్షణ, పర్యాటకం, పట్టణాభివృద్ధి, సాంస్కృతిక వారసత్వం తదితర కీలక రంగాల విస్తరణకు ఉద్దేశించిన ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  'ఆ మహాదేవుని ఆశీస్సులతో పహల్గామ్‌ దాడిపై ప్రతీకారం తీర్చుకున్నాం. ఆపరేషన్ సిందూర్ విజయాన్ని మహాశివుని పాదాలకు అంకితమిస్తున్నాను' అని ప్రధాని మోడీ అన్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రదాని మోడీ వారణాసి చేరుకున్నారు.  అనంతరం దాదాపు రూ.2,200 కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ 'ఆపరేషన్ సిందూర్ తర్వాత మొదటిసారి కాశీకి వచ్చాను. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్‌లో ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు దారుణంగా హత్యకు గురయ్యారు. బాధిత కుటుంబాల వేదన నా హృదయాన్ని ద్రవింపజేసింది. బాధిత కుటుంబాలకు ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని నేను కాశీ విశ్వనాథుణ్ణి ప్రార్థించాను' అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి 20వ వాయిదాను 9.7 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేశారు. దాదాపు రూ.2200 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అంతకు ముందు ఉత్తరప్రదేశ్ చేరుకున్న ప్రధాని మోడీని సీఎం యోగి ఆదిత్యనాథ్ సత్కరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)