జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ తో కలిసి పాల్గొన్న చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. చేనేత కుటుంబాలకు నేతన్న భరోసా పథకాన్ని అమలు చేయబోతున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రతీ చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.25 వేలు ఇచ్చేలా నేతన్న భరోసా పథకం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అలాగే ఈ నెల నుంచి చేనేత కుటుంబాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇవ్వనునన్నట్లు చంద్రబాబు మరో ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం ఇచ్చే ఉచిత విద్యుత్ వల్ల రాష్ట్రవ్యాప్తంగా 93 వేల చేనేత కుటుంబాలకు లబ్ధి జరుగుతుందని చంద్రబాబు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ లో నేతన్న భరోసా పథకం అమలు !
August 07, 2025
0
Tags