గల్వాన్‌లో మన సైనికులు దేశం కోసం వీరోచితంగా పోరాడి ప్రాణాలను త్యాగం చేసిన తర్వాత మాట్లాడిన ప్రధాని, మన భూభాగంలోకి ఎవరూ చొరబడలేదని చైనాకు ఎందుకు క్లీన్ చిట్ ఇచ్చారని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ ప్రశ్నించారు. మన సైనికులు అమరులైనప్పటి నుంచి దేశభక్తి కలిగిన ప్రతి భారతీయుడు అనేక ప్రశ్నలు లేవనెత్తినప్పటికీ సమాధానాలు ఇవ్వడానికి బదులుగా, మోడీ ప్రభుత్వం గత ఐదేళ్లుగా 'తిరస్కరించు, దృష్టి మరల్చు, అబద్ధం చెప్పు, సమర్థించు' అనే విధానాన్ని అనుసరిస్తూ వస్తోందంటూ ధ్వజమెత్తారు. జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికి మోడీ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితులైనా సృష్టించగదని జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా పాకిస్థాన్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించినప్పటికీ మోడీ నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. చైనా మన భూ భాగాన్ని ఆక్రమించిందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన కొన్ని గంటల తర్వాత జైరాం రమేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికి మోడీ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితులైనా సృష్టించగదు : జైరాం రమేశ్
August 04, 2025
0
Tags