విదేశీయులకు గోల్డెన్‌ వీసాను అందిస్తోన్న పోర్చుగల్‌

Telugu Lo Computer
0


పోర్చుగల్‌ విదేశీయులకు గోల్డెన్‌ వీసాను అందిస్తోంది. భారతీయులు సైతం ఆ దేశంలో స్థిరపడే అవకాశాన్నిస్తోంది. సుందరమైన తీరప్రాంతం, చారిత్రక నేపథ్యమున్న దేశం పోర్చుగల్‌. యూరప్‌ ఖండంలోని ఈ దేశాన్ని సందర్శించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పర్యాటకులు వెళ్తుంటారు. కొంతమంది అక్కడే స్థిరపడాలని భావిస్తుంటారు. భారతీయులు అక్కడ స్థిరపడాలంటే గోల్డెన్‌ వీసా తీసుకోవాల్సి ఉంటుంది. ఇదొక పెట్టుబడి విధానం. ఆ దేశంలో పెట్టుబడి పెట్టిన వారికి అక్కడే శాశ్వతంగా నివసించడానికి వీలు కల్పిస్తారు. ఉన్నత చదువుల కోసం, ఉద్యోగం చేసుకోవడానికి వీలుంటుంది. నిర్దేశించిన పెట్టుబడి పెట్టినట్లయితే ఈయూ పౌరసత్వం లభిస్తుంది. 18 ఏళ్లు నిండిన ఏ దేశస్థుడైనా ఈ వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి నేర చరిత్ర ఉండకూడదు. పోర్చుగల్‌లో స్థిరాస్తులు కొనుగోలు చేసే ఆర్థిక సామర్థ్యం ఉండాలి. ఏడాదిలో కనీసం 7-14 రోజులు పోర్చుగల్‌లోనే ఉండాలి. పోర్చుగల్‌ ఈక్విటీ మార్కెట్‌లో కనీసం 5 లక్షల యూరోలు (దాదాపు రూ.5 కోట్లు) పెట్టుబడి పెట్టాలి. కనీసం 10 మందికి ఉద్యోగం కల్పించే వ్యాపారం ప్రారంభించాలి. దేశంలో ఇప్పటికే ఉన్న ఏదైనా వ్యాపారంలో కనీసం 5 లక్షల యూరోలు పెట్టుబడి పెట్టడంతోపాటు కనీసం ఐదు ఉద్యోగాలు కల్పించాలి. పోర్చుగల్‌లోని ఏదైనా పరిశోధన/అభివృద్ధి సంస్థకు 5 లక్షల యూరోలు విరాళంగా ఇవ్వాలి. పోర్చుగల్‌ చారిత్రక సంపద పరిరక్షణకు 2.5 లక్షల యూరోలు వెచ్చించాలి. వీటిల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకొని పెట్టుబడి పెట్టి గోల్డెన్‌ వీసా పొందొచ్చు. 

Post a Comment

0Comments

Post a Comment (0)