ఆధార్‌, యూఏఎన్‌ అనుసంధాన ప్రక్రియను సులభతరం ఈపీఎఫ్‌ఓ

Telugu Lo Computer
0


ద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) ఆధార్‌, యూఏఎన్‌ అనుసంధాన ప్రక్రియను సులభతరం చేసింది. ఆధార్‌లోని పేరు, పుట్టిన తేదీ వివరాలు యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్‌ లోని వివరాలతో సరిపోలితే యజమాని నేరుగా కేవైసీ ఆధారంగా అనుసంధానం చేయవచ్చని తెలిపింది. ఇందుకోసం ఈపీఎఫ్‌ఓ పోర్టల్లోని కేవైసీ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. చాలా సందర్భాల్లో ఆధార్‌లోని వివరాలు యూఏఎన్ రికార్డుల్లోని వ్యక్తిగత వివరాలతో సరిపోలకపోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో గతంలో అయితే ఉడాయ్‌ కేంద్రానికి వెళ్లాల్సివచ్చేది. ఇప్పుడు ఈ ప్రక్రియనూ ఈపీఎఫ్‌ఓ సులభతరం చేసింది. ఇందుకోసం జాయింట్‌ డిక్లరేషన్‌ సౌకర్యాన్ని తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. యజమానితో కలిసి ఉద్యోగి జాయింట్‌ డిక్లరేషన్‌ సమర్పిస్తే సరిపోతుంది. దీనిద్వారా యూఏఎన్‌లో తప్పుగా నమోదైన వివరాలను సులువుగా సరిదిద్దుకోవచ్చు. గతంలో ఇదే ఆధార్‌, యూఏఎన్‌ అనుసంధాన ప్రక్రియ కష్టంగా ఉండేది. అనేక అప్రూవల్స్‌, పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండేది. కానీ ఇప్పుడు డిజిటల్‌ సిస్టమ్‌ వల్ల ఈ ప్రక్రియ సరళంగా మారింది. ఈ మార్పుతో ఉద్యోగులు తమ పీఎఫ్ అకౌంట్‌కు సంబంధించిన ప్రయోజనాలను త్వరగా పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు చందాదారు మరణించిన సందర్భంలో మైనర్లకు పింఛను, ఇతర చెల్లింపులకు గార్డియన్‌షిప్‌ సర్టిఫికెట్‌ అవసరం లేదని ఈపీఎఫ్‌ఓ తాజాగా స్పష్టంచేసింది. కొన్ని కార్యాలయాలు ఆ సర్టిఫికెట్‌ అడుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది

Post a Comment

0Comments

Post a Comment (0)