వాట్సాప్ కాల్ ద్వారా 81 ఏళ్ల వృద్ధుడి హనీ ట్రాప్ : రూ. 7 లక్షల 11 వేలు స్కామర్లు

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని అమీర్ పెట్ కు చెందిన 81 ఏళ్ల వృద్ధుడికి జూన్ మొదటి వారం నుంచి మాయ రాజ్ పుత్ అనే మహిళ పేరుతో కాల్స్, మెసేజెస్ చేశారు స్కామర్స్. చనువుగా మాట్లాడుతూ వృద్ధుడిని హనీ ట్రాప్ చేశారు. తరువాత వైద్యం ఖర్చులు, ప్లాట్ రిజిస్ట్రేషన్, తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు విడిపించడం కోసం అంటూ డబ్బులు లాగారు. బాధితుడిని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి రూ. 7 లక్షల 11 వేలు స్కామర్స్ కాజేశారు. అంతటితో ఆగకుండా ఇంకా డబ్బులు డిమాండ్ చేయడంతో వృద్ధుడు ఆందోళనకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యుల సహాయంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైబర్ మోసాలపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ అడ్డుకట్ట పడడం లేదు. 

Post a Comment

0Comments

Post a Comment (0)