ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి

Telugu Lo Computer
0


ఇండియా కూటమి  ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి (79) పేరును ఖరారు చేసింది. మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ ప్రకటన చేశారు. జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి స్వస్థలం తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం. వ్యవసాయం కుటుంబంలో జన్మించారీయన. ఉస్మానియా యూనివర్సిటీలో(1971లో) చదివారు. 1993లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005లో గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2007 జనవరి 12న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. నాలుగున్నరేళ్లు సుప్రీం కోర్టులో పని చేశారు. నల్లధనం కేసులపై కేంద్ర ప్రభుత్వ అలసత్వాన్ని విమర్శిస్తూ, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే సాల్వా జుడుమ్ చట్టవిరుద్ధమని తీర్పు ఇచ్చారు. 2011 జూలై 8న సుప్రీం కోర్టు జడ్జిగా పదవీ విరమణ చేశారు. రిటైర్డ్‌ అయ్యాక.. గోవాకు మొట్టమొదటి లోకాయుక్త చైర్మన్‌గా పని చేశారు. 2024 డిసెంబర్‌లో హైదరాబాద్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ & మీడియేషన్‌ సెంటర్‌ శాశ్వత ట్రస్టీగా బాధ్యతలు చేపట్టారు.


Post a Comment

0Comments

Post a Comment (0)