షాంఘై సహకార సంస్థ ప్రాంతీయ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీ

Telugu Lo Computer
0


చైనాలోని టియాంజిన్ నగరంలో జరగనున్న షాంఘై సహకార సంస్థ ప్రాంతీయ శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఈ భేటీ జరగనుంది. 2020లో గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల తర్వాత భారత్-చైనా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో మోడీ పర్యటనను ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడేందుకు మరో కీలక ముందడుగుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. 2019లో చివరిసారిగా ప్రధాని చైనాను సందర్శించగా 2024 అక్టోబర్‌లో బ్రిక్స్ సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ను కలుసుకున్నారు. అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన భారీ సుంకాలు, ఇటు రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై అమెరికా ఒత్తిడి నేపథ్యంలో, చైనాతో సంబంధాలను సమతుల్యంగా పునరుద్ధరించుకోవడం భారత దౌత్యంలో వ్యూహాత్మక ప్రాధాన్యత సంతరించుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)