ఎయిర్‌టెల్ యూజర్లకు పెర్‌ఫ్లిక్సిటీ ప్రో ప్రీమియం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉచితంగా మోడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎయిర్‌టెల్ యూజర్లు సంవత్సరం వరకు పెర్‌ఫ్లెక్సిటీ ప్రో మోడల్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు. అయితే ఎయిర్‌టెల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టెలికాం టాక్ ద్వారా ఈ వివరాలు అందుబాటులోకి వచ్చాయి. ఎయిర్‌టెల్ గత సంవత్సరం ఆపిల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా యూజర్లు ఆపిల్ TV+, ఆపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రయోజనాలను ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్లకు అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. కొంత మంది ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్లకు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లో ఆపిల్ మ్యూజిక్ ఆఫర్ వివరాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్లు గరిష్ఠంగా ఆరు నెలల వరకు ఆపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చని తెలుస్తోంది. గడువు ముగిసిన అనంతరం నెలవారీ రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే దీనిపై ఎయిర్‌టెల్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతోపాటు ప్రీపెయిడ్ యూజర్లు అందిరికీ అందుబాటులో ఉంటుందా? లేదా కనీస మొత్తం రీఛార్జ్ చేసిన వారికి మాత్రమే ఆపిల్ మ్యూజిక్ అందుబాటులోకి రానుందా? అనే వివరాలు తెలియాల్సి ఉంది. అయితే అన్‌లిమిటెడ్ 5G డేటా రీఛార్జ్ లేని యూజర్లకు కూడా థ్యాంక్స్ యాప్‌లో ఈ ఆఫర్ వివరాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. ఇటీవలే ఎయిర్‌టెల్ కాలింగ్, డేటా సహా 25 కు పైగా OTT రీఛార్జ్ ప్లాన్‌లతో రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇందులో నెట్‌ఫ్లిక్స్, Zee5, SonyLIV, జియోహాట్‌స్టార్, SunNXT, Aha సహా అనేక సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తోంది. 16 భాషల్లో కంటెంట్‌ను వీక్షించవచ్చని ఎయిర్‌టెల్ చెబుతోంది.
ఎయిర్‌టెల్ యూజర్లకు పెర్‌ఫ్లిక్సిటీ ప్రో ప్రీమియం ఏఐ ఉచితం
August 18, 2025
0
Tags