జాతీయ చలన చిత్ర అవార్డులకు ఎంపికైన టాలీవుడ్ ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ విజేతలను సీఎం సత్కరించారు. 'భగవంత్ కేసరి' దర్శకుడు అనిల్ రావిపూడి, 'హనుమాన్' డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, 'బేబీ' దర్శకుడు సాయి రాజేశ్ తదితరులను సీఎం శాలువాతో సత్కరించి అభినందించారు. 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల జాబితాను కేంద్రం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు. సినిమా నిర్మాణానికి హైదరాబాద్‌ను ప్రధాన కేంద్రంగా నిలపాలని సీఎం సూచించారు.
జాతీయ చలన చిత్ర అవార్డుల విజేతలను సత్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
August 18, 2025
0
Tags