హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాంకేతిక లోపం కారణంగా అలయన్స్ ఎయిర్ లైన్స్ రన్-వే పైనే నిలిచిపోయింది. దింతో హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన ఈ అలయన్స్ విమానం దాదాపు గంట సేపు పైగానే రన్నేపై ఆగిపోయింది. విమానం రన్ వేపై నుండి బయలుదేరుతుండగా మూడుసార్లు సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ అప్రమత్తమై వెంటనే ఫ్లైట్ ను నిలిపివేశాడు. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురై కిందకి దిగారు. ఈ విమానంలో సుమారు 37 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది.
శంషాబాద్ విమానాశ్రయంలో సాంకేతిక లోపంతో రన్-వేపై ఆగిపోయిన అలయన్స్ విమానం
August 24, 2025
0
Tags