ఛత్తీస్‌గఢ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను 2 శాతం పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి ప్రకటించారు. పెంచిన డీఏ కేంద్ర ప్రభుత్వం 55 శాతంతో సమానంగా ఉందని వెల్లడించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని నాలుగు లక్షలకుపైగా ఉన్న రాష్ట్ర ఉద్యోగులు ప్రయోజనం లభిస్తుందని వివరించారు. రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం విష్ణుదేవ్ సాయి చెప్పారు. 'మా ఉద్యోగులు 53 శాతం డీఏ పొందుతున్నారు. దీపావళి ముందు మేము దానిని కేంద్ర ప్రభుత్వం అందించే దానికి సమానంగా 55 శాతానికి డియర్‌నెస్ అలవెన్స్ పెంచాం' అని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి తెలిపారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన డీఏ పెంపుపై ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూనే అసంతృప్తి, ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వంతో సమానంగా ఇచ్చిన డీఏ స్వాగతించదగినదే కానీ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను పరిష్కరించలేదని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. బకాయిల చెల్లింపులు, సేవా సంబంధిత ప్రయోజనాలతో సహా దాని 11-పాయింట్ల చార్టర్ డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వంతో చేస్తునన్న చర్చల్లో ఎటువంటి పురోగతి లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ ప్రకటించిన ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం
August 23, 2025
0
Tags