ఈ ఏడాదిలో గగన్‌యాన్‌లో జీవన్‌-1 ప్రయోగం

Telugu Lo Computer
0


ఏడాదిలో గగన్‌యాన్‌ ప్రాజెక్టులో భాగమైన జీవన్‌-1 ప్రయోగాన్ని చేపడతామని షార్‌ డైరెక్టర్‌ ఈఎస్‌ పద్మకుమార్‌ తెలిపారు. శుక్రవారం షార్‌లో మీడియాతో మాట్లాడారు. జీవన్‌-1 అనంతరం జీ-2, జీ-3 లాంటి ప్రయోగాలుంటాయని తెలిపారు. పలు ప్రయోగాల అనంతరం 2035లో మానవ సహిత గగన్‌యాన్‌ మిషన్‌ ఉంటుందని పేర్కొన్నారు. జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ద్వారా ప్రయోగించిన నైసార్‌ అద్భుతంగా పనిచేస్తోందని, ఆ ఉపగ్రహానికి ఉన్న 12 అడుగుల యాంటెన్నా కూడా విజయవంతంగా విచ్చుకుందని తెలిపారు. ఈ ఏడాదిలోనే పీఎస్‌ఎల్‌వీ ఎన్‌1 పేరుతో చేపట్టే మరో 5 ప్రయోగాలు కూడా వాణిజ్యపరమైనవేనని చెప్పారు. ఎల్‌ఎవీఎం3 ఎం5 ద్వారా కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని లేదా ఈఓఎస్‌ ఉపగ్రహాన్ని కాని ప్రయోగించే అవకాశముందని వివరించారు. పీఎస్‌ఎల్‌వీ సీ62, సీ63 ప్రయోగాలు కూడా ఈ ఏడాది ఉంటాయని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)