ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ బాబ్ సింప్సన్ కన్నుమూత

Telugu Lo Computer
0


స్ట్రేలియా మాజీ క్రికెట్ కెప్టెన్, కోచ్ బాబ్ సింప్సన్ 89 ఏళ్ల వయసులో సిడ్నీలో కన్నుమూశారు. ఆయన ఆస్ట్రేలియా క్రికెట్‌లో నాలుగు దశాబ్దాలకు పైగా ఆటగాడిగా, కెప్టెన్‌గా, కోచ్‌గా తనదైన ముద్ర వేశారు. అలాగే జట్టు నిర్మాతగా, రిఫరీగా, వ్యాఖ్యాతగా కూడా ఆయన సేవలు అందించారు. ఆస్ట్రేలియా క్రికెట్‌కు ఇది తీరని లోటని క్రికెట్ ఆస్ట్రేలియా తన ప్రకటనలో తెలిపింది. బాబ్ సింప్సన్ 1957లో ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్ జట్టులో చేరారు. 1977లో వరల్డ్ సిరీస్ క్రికెట్ సంక్షోభం తర్వాత 41 ఏళ్ల వయసులో మళ్లీ క్రికెట్‌లోకి అడుగుపెట్టి ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో ఆస్ట్రేలియా జట్టు బలహీనంగా ఉండేది. దానిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన గొప్ప రన్ స్కోరర్. 1960లలో బిల్ లారీతో కలిసి అద్భుతమైన ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత ఆయనను ఆస్ట్రేలియా ఫుల్-టైమ్ కోచ్‌గా నియమించింది. 1964లో ఇంగ్లండ్ జట్టుపై 311 పరుగులు చేసి టెస్టుల్లో ట్రింపుల్ సెంచరీ సాధించిన రెండో ఆస్ట్రేలియా ఆటగాడిగా నిలిచారు. స్లిప్ ఫీల్డర్ గా కూడా ఆయనకు గొప్పపేరుంది. 62 టెస్టుల్లో 110 క్యాచ్‌లతో రికార్డు సృష్టించారు. 1964లో ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన.. 1968లో రిటైర్ అయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)