ఆగస్టు 15 నుండి ఆన్‌లైన్ ఇన్‌స్టంట్ మనీ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) బదిలీపై కస్టమర్లు రుసుము చెల్లించాల్సి ఉంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇది గతంలో పూర్తిగా ఉచితం ఉండేది. ఐఎంపీఎస్ అనేది రియల్-టైమ్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్. దీని సహాయంతో ఎవరైనా తక్షణమే డబ్బును బదిలీ చేయవచ్చు. ఈ సేవ 24 గంటలు 365 రోజులు అందుబాటులో ఉంటుంది. అయితే ఇందులో కొన్నింటికి కొత్త ఛార్జీలు విధిస్తుండగా, కొన్నింటికి ఎలాంటి మార్పులు చేయలేదని బ్యాంక్ వెల్లడించింది. ఇన్‌స్టంట్ మనీ పేమెంట్ సర్వీస్ ద్వారా ఒకేసారి గరిష్టంగా రూ.5 లక్షల వరకు బదిలీ చేయవచ్చు. ఎస్బీఐ చేసిన మార్పు ఆన్‌లైన్ లావాదేవీలపై మాత్రమే వర్తిస్తుందని, కొన్ని స్లాబ్‌లలో నామమాత్రపు ఛార్జీలు ఉంటాయని బ్యాంకు తెలిపింది. అయితే ఈ ఛార్జీలు ఇప్పటికీ కొన్ని ఖాతాలపై విధించడం లేదు. రూ.25,001-రూ.1,00,000: రూ.2 + ప్రతి లావాదేవీకి జీఎస్టీ, రూ.1,00,001-రూ.2,00,000: రూ.6 +జీఎస్టీ, రూ.2,00,001-రూ.5,00,000: రూ.10 + జీఎస్టీ. ఇప్పటివరకు అన్ని ఆన్‌లైన్ ఐఎంపీఎస్ లావాదేవీలు మొత్తంతో సంబంధం లేకుండా ఉచితంగా ఉండేవి. కొంతమంది కస్టమర్లు ఆన్‌లైన్ ఐఎంపీఎస్ కోసం అధిక మొత్తాలకు కూడా జీరో ఛార్జీలు ఉంటాయని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. ఇందులో రక్షణ, పారా-మిలిటరీ, ఇండియన్ కోస్ట్ గార్డ్, కేంద్ర ప్రభుత్వం, పోలీసు, రైల్వే ఉద్యోగులకు మినహయింపు ఇచ్చింది. ఈ నిర్ణయం ఎస్‌బీఐ ఆన్‌లైన్ ఐఎంపీఎస్ ఛార్జీలను పరిశ్రమ నిబంధనలకు అనుగుణంగా మార్చింది. అదే సమయంలో రోజువారీ తక్కువ-విలువ కలిగిన బదిలీలు మెజారిటీ కస్టమర్లకు ఉచితంగా ఉండేలా చేసింది.
ఎస్బీఐ ఐఎంపీఎస్ లావాదేవీలపై ఆగస్టు 15 నుండి ఛార్జీలు
August 14, 2025
0
Tags